శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం

2 గంటల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జకార్తా : ఇండోనేషియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ ‌స్కేల్‌‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ ‌సర్వే (యుఎస్‌‌జిఎస్‌) ‌వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన శుక్రవారం ఉదయం 11.31 గంటల సమయంలో సంభవించింది. నార్త్ మలుకు ప్రావిన్స్‌లోని టోబెలో పట్టణానికి పశ్చిమాన సుమారు 58 కిలోమీటర్ల దూరంలో 120 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యుఎస్‌‌జిఎస్‌ ‌వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.

కాగా, ఈ భూకంపం వల్ల నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన గురించి టెర్నాటే నివాసి ఉమర్‌ అబ్బాస్‌ ‌మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రోడ్డు పక్కన ఉన్న కాఫీ స్టాల్‌లో కూర్చుని కాఫీ తాగుతుండగా, అకస్మాత్తుగా నా కుర్చీ ఊగడం మొదలైంది. గత భూకంపాల తాలూకు భయం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. మళ్లీ ఈరోజు భూప్రకపంనలకు క్షణకాలంపాటు వణికిపోయాను’ అని ఆయన అన్నారు. భూకపం కేంద్రానికి టెర్నాటే 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే సునామీ ముప్పు ఏమీ లేదని ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇండోనేషియాలో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్