- ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయిల్ అభ్యంతరం
వాషింగ్టన్: ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల అమెరికా జాబితా నుంచి సిరియాను తొలగించే ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలకు పదేపదే మద్దతు ఇచ్చిన దేశాలను అమెరికా విదేశాంగ శాఖ 'ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు'గా గుర్తిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ నిర్ణయం రాబోయే 45 రోజుల్లో అమల్లోకి రానుంది. ఈ చర్యతో సిరియా ప్రజలకు అభివృద్ధి, పునర్నిర్మాణ దిశగా ముందుకు సాగే అవకాశం లభిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా మధ్య సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, సిరియాను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితా నుంచి తొలగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. 1979 నుంచి అమెరికా సిరియాను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా గుర్తిస్తూ వస్తోంది.








కామెంట్‌లు (0)