గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionథానే ఆసుపత్రి డాక్టర్‌పై దాడి

15 గంటల క్రితం

sivasena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • శివసేన(ఏక్‌నాథ్ షిండే) కార్పొరేటర్‌ దుర్మార్గం

థానే : మహారాష్ర్టలోని థానే ఆసుపత్రిలో శివసేన(ఏక్‌నాథ్ షిండే) కార్పొరేటర్‌ ‌రమేష్‌ ‌మ్హత్రే మహిళా డాక్టర్‌‌పై దాడి చేశారు. అడ్డువచ్చిన సహచర డాక్టర్‌‌పై కూడా ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయిది. కార్పొరేటర్‌‌ను తక్షణమే అరెస్టు చేయాలని సోషల్‌ ‌మీడియా హోరెత్తింది. దీంతో బుధవారం ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను తీసుకెళ్లారు. తరువాత స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. థానే జిల్లాలోని కళ్యాణ్-డోంబివిలీ మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) పరిధిలోని శాస్త్రి నగర్ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిపై సోమవారం రాత్రి రమేష్‌ ‌మ్హత్రే, అతని అనుచరులు దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడికి నిరసనగా రెసిడెంట్ వైద్యులు, నర్సులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వైద్యులు గురువారం నల్ల రిబ్బన్లు ధరించి సేవలు కొనసాగిస్తుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని నర్సులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం మ్హత్రే లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే మహిళా వైద్యురాలిపై దాడి చేశానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘మీరు సిసిటివిలోని ఒక నిర్దిష్ట కెమెరా కోణం (యాంగిల్) ద్వారా మాత్రమే ఆ ఘటనను చూస్తున్నారు’ అని మ్హత్రే అన్నారు. ‘ఆమె ఫోన్‌లో ఉంటూ మా సమస్యలను వినకపోవడంతో, నేను ఆమె చేతిని తట్టాను (హెచ్చరించడానికి). మేము బాలాసాహెబ్ బోధనలను అనుసరిస్తాం. మేము ఎప్పుడూ మహిళలపై చేయి చేసుకోలేదు, భవిష్యత్తులోనూ అలా చేయం" అని చెప్పారు. అలాగే, ఆసుపత్రిలో ఉన్న లోపాల వల్లే ఈ ఘటన జరిగిందని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడకలు అందుబాటులో లేకపోవడం వల్ల, గర్భవతి అయిన ఒక మహిళను వేరే చోటికి పంపించారని ఆవేదనతో ఆమె కుటుంబం నుండి ఫోన్ కాల్ రావడంతో తాను ఆసుపత్రికి వెళ్లినట్లు కార్పొరేటర్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్