గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గగన్‌‌యాన్‌ మరో పరీక్ష విజయవంతం

3 రోజుల క్రితం

gaganyaan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌‌యాన్‌ ‌మిషన్‌‌కు సంబంధించిన మరో పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. సబ్ - ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్‌పెరిమెంట్స్ (ఎస్‌ఓఎల్‌‌విఇ)లో మొదటి గ్రౌండ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ నెల 3న ఈ పరీక్షను నిర్వహించినట్లు బెంగళూరులోని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. గగన్‌యాన్‌‌ నిర్వహణకు ఎస్‌ఓఎల్‌‌విఇ ఒక కీలకమైన అంశంగా అధికారులు తెలిపారు. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌‌కు చెందిన డీసెలరేషన్ సిస్టమ్ ధ్రువీకరణ కోసం ఇంటిగ్రేటెడ్ పారాచూట్ పరీక్షలను నిర్వహించడానికి, సాలిడ్ మోటార్ ఆధారిత ఎస్‌ఓఎల్‌‌విఇను ఒక టెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా ఇస్రో అభివృద్ధి చేస్తోంది. పరీక్షా సమయంలో మోటార్ పనితీరు ఊహించిన విధంగానే ఉందని ఇస్రో అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి కీలక పరీక్షలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ మిషన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వ్యోమగాములతో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్య బృందాలకు బిహెవియరల్‌ పరీక్షలను నిర్వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్