న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేవారం న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. నాలుగు దశాబ్దాలలో ఇప్పటివరకూ ఏ భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించలేదు. 40 ఏళ్లలో భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జూలై 10వ తేదీన మోడీ న్యూజిలాండ్‌లో ప్రధాన నగరమైన ఆక్లాండ్‌కు చేరుకుంటారని ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శుక్రవారం ప్రకటించారు. మళ్లీ జూలై 11వ తేదీన మోడీ మళ్లీ తిరిగి పయనమవుతారని ఆయన వెల్లడించారు.
కాగా, గత 40 ఏళ్లలో న్యూజిలాండ్‌ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోడీ నిలుస్తారని, ఆయన పర్యటన చారిత్రాత్మకమైనదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ అభివర్ణించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి దోహదం చేస్తుంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు వాణిజ్యం, విద్య, సాంకేతికత, పర్యాటకం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, వ్యూహాత్మక సహకారం వంటి విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)