ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సైన్స్ ప్రజలకు మంచి చేయాలి

2 గంటల క్రితం

swaminadhan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సౌమ్యా స్వామినాథన్

బెంగళూరు : సైన్స్ అనేది కేవలం ఓ అన్వేషణ మాత్రమే కాదని, అది ప్రజలకు మంచి కూడా చేయాలని అని ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) 2026 స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె వర్చువల్‌గా ప్రసంగించారు. భవిష్యత్తులో ముఖ్యమైన ఆవిష్కరణలు కేవలం ఒకే రంగం నుంచే కాకుండా వివిధ రంగాల కలయిక నుంచి వస్తాయని ఆమె తెలిపారు. నోబెల్ బహుమతులనే తీసుకుంటే చాలా మంది పరిశోధకులు ఒక రంగం నుంచి ప్రారంభించి మరో రంగానికి మారుతుంటారని గుర్తు చేశారు. ‘మీ తరం అపారమైన ప్రయోజనం పొందుతోంది. ఎందుకంటే మీరు ఈ కొత్త యుగంలో శిక్షణ పొందారు. ఇక్కడ భాగస్వామ్యం అనేది మినహాయింపు కాకుండా ఓ నియమంగా మారింది. దానిని కాపాడుకోండి’ అని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ గౌరవ వ్యవస్థాపకుడు, ఐఐఎస్‌సీ కౌన్సిల్ సభ్యుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ కూడా ప్రసంగించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్