- శ్రమజీవుల పతాకకు నిప్పు పెట్టి పైశాచికం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార బిజెపి గూండాలు సంఘ్ పరివార్ మూకలతో కలిసి హద్దుమీరి దాడులకు పాల్పడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మూకలు ఇటీవల నిర్వహించిన ఒక ర్యాలీలో శ్రమజీవుల పతాక అయిన ఎర్ర జెండాను తగులపెట్టి పైశాచికాన్ని ప్రదర్శించారు. ఈ దుర్మార్గపు చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు షేర్ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మూకలు వారి తాతలైన హిట్లర్ కాలం నాటి నాజీల అడుగుజాడల్లో నడుస్తున్నారని విమర్శించింది. ఈ దుర్మార్గపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం పేర్కొంది. ఎర్రజెండా శ్రమజీవుల మనస్సుల్లో, హృదయాల్లో ఉంటుందని గుర్తు చేసింది.








కామెంట్‌లు (0)