ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జనావాసాల మధ్య గూగుల్ డేటా సెంటర్ వద్దు

1 గంట క్రితం

data center
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆరిలోవలో సిపిఎం పాదయాత్ర

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ అడివివరం సెంట్రల్ జైలుకు ఆనుకొని ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్‌‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆరిలోవ టిఐసి పాయింట్‌ జంక్షన్ నుంచి చివరి బస్టాప్ వరకు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆర్‌‌కెఎస్‌‌వి కుమార్‌ మాట్లాడుతూ గూగుల్ అదాని డేటా సెంటర్‌‌కు దేవస్థానం కొండపై 160 ఎకరాల భూమిని టిడిపి కూటమి ప్రభుత్వం కేటాయించడాన్ని తప్పుబట్టారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే లక్ష మందికి ఉపాధి వస్తుందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో డేటా సెంటర్ వల్ల ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, కొండలు ధ్వంసమవుతాయని, వేడి, శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతిని కాలుష్యకారక రోగాలు పెరుగుతాయని మేధావులు, పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి లక్ష కుటుంబాలకు నీరు రాకుండా పోతుందన్నారు. ప్రపంచంలో గూగుల్ డేటా సెంటర్లను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. అమెరికాలాంటి దేశమే డేటా సెంటర్లు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో ప్రభుత్వ భూములన్నింటినీ కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్‌‌కు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, నాయకులు డి అప్పలరాజు, వి నరేంద్ర కుమార్, పి శంకర్రావు, పి వెంకటరావు, కె కుమారి, డి నాగరాజు, డి కొండమ్మ, ఆర్ రవణమ్మ, ఐసి నాయుడు, బి భారతి, జెఆర్ నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్