విజయవాడ : ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారకులైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ .... సోమవారం విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు సంఘీభావ సదస్సు జరగనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారకులైన కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ .... విద్యార్థుల పక్షాన న్యాయ పోరాటం చేస్తున్న విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ దీక్షను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ .... విద్యార్థుల ఉద్యమం పట్ల సంఘీభావం తెలియజేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సులో విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
నేడే విద్యార్థుల ఉద్యమం పట్ల 'సంఘీభావ సభ`
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)