సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేటు గొడ్డలివేటు

3 గంటల క్రితం

private
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిశ్రామిక ప్రగతంతా

ప్రమాదాల ప్రహసనం.

​ప్రాణానికి విలువలేదు,

గాయాలకు మందులేదు.

​భద్రతపై ఖర్చు శూన్యం,

లాభాలే మనకు ముఖ్యం.

నిరుద్యోగుల సైన్యం బారులు తీరి ఉండగా

ఎందుకింక భయం? ఎవడో ఒకడు దొరకడా?

వీడు రానంటే మరొకడు సిద్ధం- బలిపశువుల క్యూ ఉందిగా?

అతిపెద్ద జనాభాలో అవుతాడెవడో బకరా!

​ట్రెయినింగులా? అవి శుద్ధ దండగ.

అవన్నీ పబ్లిక్ సెక్టార్ల ఖాతాలోనేగా, ముందుగా.

​మూతబడ్డ ప్రభుత్వ పరిశ్రమలు

మనకు రిక్రూట్‌మెంట్ సెంటర్లు.

​కల్పించి చూడు కాస్తంత అభద్రత,

కష్టించి చూపుతారు రాత్రనక, పగలనక.

​ఉద్యోగం ఊడితే తెలిసొస్తుందోయ్

ప్రైవేటు రంగం తడాఖా! ఇదేమన్నా మజాకా?

​వీధినపడ్డ కుటుంబాలు లబోదిబోమంటున్నాయ్,

షేర్లు కుదేలై ఇన్వెస్టర్లు మొరపెడుతున్నారు.

అప్పులిచ్చేవి ప్రభుత్వ బ్యాంకులే, నిజమే మరి;

ప్రజల సొమ్ముతోనేగా మనం ఆడుకొనేది?

​తీర్చకపోతే మాత్రం కొంపేం మునుగుతుంది?

గోడకు వేసిన సున్నం అని వాళ్లకీ తెలుసు!

​నష్టం వస్తే దుకాణం మూసేస్తాం, బోర్డు తిప్పేస్తాం;

పేర్లు మార్చేసుకుంటాం, షేర్లు అమ్మేసుకుంటాం.

​చేతులు దులిపేసుకుందాం,

ఎవరి కర్మకు వాళ్లను వదిలేద్దాం!

మన చేతిలో ఏముంది? నిమిత్తమాత్రులం;

ఇవాళ ఉంటాం, రేపు పోతాం.

​వీలైతే మరో కంపెనీ తెరుద్దాం,

లేదంటే దుబాయో, లండనో చెక్కేద్దాం!

- ఉణుదుర్తి సుధాకర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్