సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు?

1 గంట క్రితం

photo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 06:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

- ఎపి టెట్- 2026 భౌతికశాస్త్రం ప్రిపరేషన్

భౌతిక శాస్త్రం అంటే కొందరికి భయం. మరికొందరికి మజా. కానీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లను స్నేహితులుగా చేసుకుంటే ఫిజిక్స్ కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. ఎలక్ట్రాన్ లాగా ఎప్పుడూ కదులుతూ ఉండండి. ఎందుకంటే అది ఆగిపోతే కరెంట్ ఉండదు.

మీరు ఆగిపోతే ప్రోగ్రెస్ ఉండదు. ప్రోటాన్ లాగా పాజిటివ్‌గా ఆలోచించండి. పరీక్షలో కఠినమైన ప్రశ్న కనిపించినా, ఇది కఠినమైనదే కావొచ్చు. కానీ అసాధ్యమైనది కాదు అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. న్యూట్రాన్ లాగా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే టెన్షన్ పెరిగితే మెదడు "షార్ట్ సర్క్యూట్" అయ్యే ప్రమాదం ఉంది. పరీక్ష హాల్లో మాత్రం ఫోటాన్‌ను మించిపోవాలి. ప్రశ్న చూసిన వెంటనే కాంతి వేగంతో ఆలోచించి సరైన సమాధానాన్ని గుర్తించాలి.

1. ఎలక్ట్రాన్ ఆవిష్కర్త ఎవరు?

A) రూథర్‌ఫోర్డ్B) జె.జె. థామ్సన్

C) బోర్D) ఐన్‌స్టీన్

2. ఫోటోఎలక్ట్రిక్ ప్రభావాన్ని వివరించిన శాస్త్రవేత్త?

A) మ్యాక్స్ ప్లాంక్B) ఐన్‌స్టీన్

C) బోర్D) హైజెన్‌బర్గ్

3. ప్లాంక్ స్థిరాంకం యొక్క SI ప్రమాణం ఏమిటి?

A) J/sB) J.s

C) N/mD) C/s

4. అణు కేంద్రకంలో ఉండనిది?

A) ప్రోటాన్B) న్యూట్రాన్

C) ఎలక్ట్రాన్D) పైవన్నీ

5. హైడ్రోజన్ అణు నమూనాను

ప్రతిపాదించినవారు?

A) థామ్సన్B) బోర్

C) డాల్టన్D) ఫరాడే

6. రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు?

A) బెకెరెల్B) చాడ్విక్

C) రూథర్‌ఫోర్డ్D) ప్లాంక్

7. ఆల్ఫా కణం అనగా?

A) ఎలక్ట్రాన్B) న్యూట్రాన్

C) ప్రోటాన్ D) హీలియం కేంద్రకం

8. బీటా కిరణాలు ఏవి?

A) హీలియం కేంద్రకాలుB) ఎలక్ట్రాన్లు

C) ప్రోటాన్లుD) న్యూట్రాన్లు

9. Y కిరణాలు ఏమిటి?

A) ధనావేశ కణాలుB) ఋణావేశ కణాలు

C) విద్యుదయస్కాంత తరంగాలుD) ప్రోటాన్లు

10. E = mc2 సమీకరణాన్ని ప్రతిపాదించినవారు?

A) న్యూటన్B) ఐన్‌స్టీన్

C) ప్లాంక్D) బోర్

11. విద్యుత్ ప్రవాహం SI ప్రమాణం?

A) వోల్ట్B) ఓమ్

C) ఆంపియర్D) కూలాంబ్

12. ఓమ్ సూత్రం ప్రకారం V = ?

A) IRB) I/R

C) R/ID) I2R

13. నిరోధం SI ప్రమాణం?

A) వోల్ట్B) ఆంపియర్

C) ఓమ్D) వాట్

14. ఒక కూలాంబ్ ఛార్జ్ అంటే?

A) 1 A × 1 s B) 1 A × 1 V

C) 1 V × 1 s D) 1 గ్రీక్‌ ఆల్ఫాబీట్‌ × 1 s

15. విద్యుత్ శక్తి ప్రమాణం?

A) వాట్B) జౌల్

C) కూలాంబ్D) వోల్ట్

16. విద్యుత్ శక్తి వినియోగ యూనిట్?

A) kWh B) kW

C) WhD) J

17. శ్రేణి కలయికలో (Series Connection)

కరెంట్ పంపిణీ ఎలా ఉంటుంది?

A) మారుతుందిB) అన్ని చోట్ల సమానం

C) శూన్యంD) రెట్టింపు

18. సమాంతర కలయికలో కింది వాటిలో

ఏది సమానంగా ఉంటుంది?

A) కరెంట్B) శక్తి

C) వోల్టేజ్D) నిరోధo

19. ఫ్యూజ్ తీగ ఏ లక్షణం కలిగి ఉంటుంది?

A) అధిక ద్రవీభవన స్థానం B) తక్కువ ద్రవీభవన స్థానం

C) అధిక నిరోధకత లేదు D) సూపర్ కండక్టర్

20. గృహ విద్యుత్ సరఫరా స్వభావం ఏమిటి?

A) ప్రత్యక్ష విద్యుత్ ప్రవాహం (DC)

B) ప్రత్యామ్నాయ విద్యుత్ ప్రవాహం (AC)

C) రెండూD) ఏదీ కాదు

21. సెమీకండక్టర్ ఉదాహరణ?

A) రాగిB) అల్యూమినియం

C) జర్మేనియంD) వెండి

22. డయోడ్‌లో PN జంక్షన్‌ల సంఖ్య?

A) 1B) 2C) 3D) 4

23. డయోడ్ ప్రధాన ఉపయోగం?

A) ఆంప్లిఫికేషన్B) రెక్టిఫికేషన్

C) నిల్వD) ప్రసారం

24. AC ను DC గా మార్చేది?

A) ట్రాన్సిస్టర్B) ఇండక్టర్

C) రెసిస్టర్D) డయోడ్

25. LED యొక్క పూర్తి రూపం?

A) Light Emission Device

B) Light Emitting Diode

C) Light Electronic Diode

D) Low Energy Device

26. ట్రాన్సిస్టర్‌లో టెర్మినల్స్ సంఖ్య?

A) 2B) 3C) 4D) 5

27. ట్రాన్సిస్టర్‌లో మధ్య భాగం?

A) ఎమిటర్B) కలెక్టర్C) బేస్ D) జంక్షన్


28. ట్రాన్సిస్టర్ ఉపయోగం?

A) ఆంప్లిఫై చేయడం B) స్విచ్‌గా పనిచేయడం

C) రెండూ D) ఏదీ కాదు

29. IC పూర్తి రూపం?

A) Internal Circuit

B) Integrated Circuit

C) International Circuit

D) Intelligent Circuit

30. కంప్యూటర్‌లో బైనరీ సంఖ్యా పద్ధతి?

A) Base-10B) Base-8

C) Base-2D) Base-16

31. లాజిక్ గేట్‌లలో ప్రాథమిక గేట్ కాదు?

A) ANDB) OR

C) NOTD) NAND

32. NAND గేట్‌ను అంటారు?

A) Universal GateB) Binary Gate

C) Memory GateD) Basic Gate

33. ఫోటాన్ శక్తి సూత్రం?

A) mc2B) hVC) VID) I2R

34. ఫోటాన్ విశ్రాంతి ద్రవ్యరాశి?

A) 1 kgB) 0

C) 9.1×10-30 kgD) అనంతం

35. అనిశ్చితి సూత్రం ప్రతిపాదించినవారు?

A) ప్లాంక్B) బోర్

C) హైజెన్‌బర్గ్D) డి బ్రోగ్లీ

36. డి బ్రోగ్లీ (de Broglie) సిద్ధాంతం దేనికి సంబంధించింది?

A) తరంగ-కణ ద్వంద్వ స్వభావం B) విద్యుత్ ప్రవాహం

C) అయస్కాంతం D) ధ్వని

37. న్యూట్రాన్‌ను కనుగొన్నది?

A) చాడ్విక్B) థామ్సన్

C) బోర్D) ఫరాడే

38. అణు సంఖ్య సూచించేది?

A) న్యూట్రాన్లుB) ప్రోటాన్లు

C) ఎలక్ట్రాన్లు మాత్రమేD) న్యూక్లియాన్లు

39. ద్రవ్యరాశి సంఖ్య =

A) ప్రోటాన్లు + న్యూట్రాన్లు B) ప్రోటాన్లు + ఎలక్ట్రాన్లు

C) న్యూట్రాన్లు + ఎలక్ట్రాన్లు D) పైవేవీ కాదు

40. యురేనియం-235 ఉపయోగం?

A) ఇంధనంB) అణు రియాక్టర్

C) అణు బాంబుD) పైవన్నీ

41. విద్యుత్ క్షేత్ర ప్రమాణం?

A) N/CB) J/C

C) W/sD) గ్రీక్‌ ఆల్ఫాబీట్

42. విద్యుత్ పొటన్షియల్ ప్రమాణం?

A) ఓమ్B) వోల్ట్

C) ఆంపియర్D) వాట్

43. కెపాసిటర్ ప్రమాణం?

A) హెన్రీB) ఫారడ్C) ఓమ్D) వాట్

44. ఇండక్టెన్స్ ప్రమాణం?

A) ఫారడ్B) హెన్రీC) ఓమ్D) వోల్ట్

45. కిర్చాఫ్ నియమాలు సంబంధించేది?

A) విద్యుత్ వలయాలుB) కాంతి

C) ధ్వనిD) ఉష్ణం

46. వోల్ట్‌మీటర్‌ను ఎలా కలుపుతారు?

A) శ్రేణిలో B) సమాంతరంగా

C) రెండూD) ఏదీ కాదు

47. అమ్మీటర్‌ను ఎలా కలుపుతారు?

A) శ్రేణిలో B) సమాంతరంగా

C) రెండూD) ఏదీ కాదు

48. సూపర్ కండక్టర్ నిరోధం ?

A) ఎక్కువB) తక్కువ

C) సున్నాD) అనంతం

49. Zener డయోడ్ ఉపయోగం?

A) వోల్టేజ్ నియంత్రణ B) రెక్టిఫికేషన్

C) ఆంప్లిఫికేషన్D) నిల్వ

50. సౌర ఘటకం ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.

A) ఉష్ణB) కాంతి

C) రసాయనD) యాంత్రిక

51. సెంటర్-ట్యాప్డ్ పూర్తి తరంగ రెక్టిఫైయర్‌లో ఉపయోగించే డయోడ్ల సంఖ్య?

A) 1B) 2

C) 3 D) 4

52. లాజిక్ 1 సూచించేది?

A) LOWB) HIGH

C) OFFD) NULL

53. PN జంక్షన్ ఫార్వర్డ్ బయాస్‌లో?

A) కరెంట్ ప్రవహిస్తుంది

B) కరెంట్ ప్రవహించదు

C) నిరోధం అనంతం

D) ఛార్జ్ ఉండదు

54. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే సంఖ్యలు?

A) 0,1B) 1,2

C) 2,3 D) 1,10

55. రేడియోధార్మికత యొక్క SI ప్రమాణం?

A) సీవర్ట్B) బెకెరెల్

C) రాడ్D) గ్రే

56. లేజర్ యొక్క ప్రత్యేకత?

A) ఏకవర్ణత్వంB) దిశాబద్ధత

C) సమకాలికతD) పైవన్నీ

57. ఎలక్ట్రాన్ ఛార్జ్ విలువ?

A) 1.6 × 10-19 C B) 1.6 × 10-18 C

C) 1.6 × 10-20 C D) 1.6 × 10-17C

58. అత్యంత చొచ్చుకుపోయే రేడియోధార్మిక కిరణం?

A) ఆల్ఫాB) బీటా

C) YD) X

59. ట్రాన్స్‌ఫార్మర్ పనిచేసే సూత్రం?

A) విద్యుదయస్కాంత ప్రేరణ

B) ఫోటోఎలక్ట్రిక్ ప్రభావం

C) రేడియోధార్మికత D) థర్మియానిక్ ఉద్గారం

60. కాంతి వేగం శూన్యంలో?

A) 3 × 108 m/sB) 3 × 106 m/s

C) 3 × 107 m/sD) 3 × 109 m/s

61. టీవీ రిమోట్ కంట్రోల్ నుండి టీవీకి సంకేతాలను పంపడానికి ప్రధానంగా ఉపయోగించే వికిరణం ఏది?

A) అతినీలలోహిత కిరణాలు B) పరారుణ కిరణాలు

C) X-కిరణాలు D) గామా కిరణాలు

62. మొబైల్ ఫోన్ ఛార్జర్‌లో ACవిద్యుత్‌ను అవసరమైన తక్కువ DCవిద్యుత్‌గా మార్చడంలో ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరం ఏది?

A) రెక్టిఫయర్ B) ఆసిలేటర్

C) మైక్రోఫోన్ D) లౌడ్‌స్పీకర్

63. సౌర ఘటాలలో సూర్యకాంతిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చే భౌతిక సూత్రం ఏది?

A) విద్యుదయస్కాంత ప్రేరణ B) ఫోటోవోల్టాయిక్ ప్రభావం

C) జౌల్ ప్రభావం D) డాప్లర్ ప్రభావం

64. ఇంటిలో ఉపయోగించే LED బల్బు సాధారణ బల్బుతో పోలిస్తే తక్కువ విద్యుత్‌ను వినియోగించడానికి ప్రధాన కారణం ఏమిటి?

A) ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది

B) విద్యుత్ శక్తిని ఎక్కువ భాగం కాంతిగా మారుస్తుంది

C) ఎక్కువ నిరోధం కలిగి ఉంటుంది

D) అధిక వోల్టేజ్‌ను ఉత్పత్తి చేస్తుంది

65. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ లేదా అధిక విద్యుత్ ప్రవాహం ఏర్పడినప్పుడుMCB చేసే పని ఏమిటి?

A) వోల్టేజ్‌ను పెంచుతుంది

B) విద్యుత్‌ను నిల్వ చేస్తుంది

C) విద్యుత్ సరఫరాను స్వయంచాలకంగా నిలిపివేస్తుంది*D) ACనిDCగా మారుస్తుంది



- డాక్టర్ పల్లె. సూర్యనాగి రెడ్డి

భౌతికశాస్త్ర అధ్యాపకులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, (అటానమస్‌)

అనంతపురం

సెల్‌ : 9491155894

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్