విశాఖ మహానగరానికి
విశాల సాగరాన్ని విడిచిపెట్టి
వీడిపోయింది విమానాశ్రయం
వాలింది భోగాపురాన వైభోగంగా!
వాల్తేరు రైలు కూత దువ్వాడకు చేరుతోంది
రాజకీయ రణతంత్రంలో
ఉక్కు నగరానికి దిక్కు తోచకుండా పోతోంది
విభజిత ఆంధ్రాకు పెట్టుబడుల రాబడులకు,
విశ్వ విపణిలో అంగడి సరుకై మిగిలింది!
రాజధాని మాట అటుంచుగాని
రాతి కొండలే తరగిపోతున్నాయి
ఉక్కు కండలే కరగిపోతున్నాయి
రాజభవనాలే పెరిగిపోతున్నాయి
ఫార్మా సిటీల విషవాయువులు
ఊపిరితిత్తులను ఉడికిస్తుంటే
ఐటీ కొలువుల ఆశల దీపాలు
నిరుద్యోగ నిశ్శబ్దంలో ఆరిపోతుంటే
మెట్రో కలలు కాగితాలకే పరిమితమై
రోడ్లపై ట్రాఫిక్ నరకం చూపుతుంటే...
నిలువెత్తు కొండలకు ధీటైన ఆత్మస్థైర్యంతో,
అంతులేని ఆవేదనను
సాగర గర్భంలో దాచుకుంటోంది
విశాఖ నగరం!
- బంధకవి శ్రీనివాస రామారావు
94406 59726
ఎగిరిపోయిన విమానం!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 01:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)