ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం ఆతవ గ్రామం రెవెన్యూ పరిధిలో నెంబర్ 17 లో గడ్డ వాగులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న మద్ది చెట్లను ఏ విధమైన అనుమతులు లేకుండా నరికి వేస్తున్నట్టు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు డిప్యూటీ తాసిల్దారు రామకృష్ణకు తెలియజేశారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారి జుత్తాడా దేవుడు బాబుకు సమాచారం ఇచ్చి చెట్లు నరికి వేసిన వాటిని ఆపివేయాలని తహసిల్దారు ఆదేశించడంతో వీఆర్వో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రభుత్వ భూముల్లోని చెట్లను నరికి వేయడం తప్పు అని తెలిపారు. కనీసం ఏ విధమైన అనుమతులు లేకుండా చెట్లను నరకడం జరిగినట్లు గుర్తించి నివేదిక ఎమ్మార్వో కి తెలియజేస్తారని వీఆర్వో తెలిపారు.
అనుమతులు లేకుండా మద్ది చెట్లు నరికివేత
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)