సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల భారీ నిరసన ర్యాలీ

1 గంట క్రితం

Massive protest rally by police job candidates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో భారీ నిరసన


ప్రజాశక్తి-కాకినాడ : మెగా పోలీస్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేసి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ .... కాకినాడలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు శారదమ్మ గుడి సర్కిల్‌కు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ జాబ్ ఎక్కడ ? మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ అభ్యర్థులు నినాదాలు చేశారు. పోలీస్ ఉద్యోగాల కోసం చాలాకాలంగా సిద్ధమవుతున్న తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. శారదమ్మ గుడి సర్కిల్ వద్ద కొంతసేపు నిరసన తెలిపిన అనంతరం అభ్యర్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం కారణంగా వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ, పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసి, నియామక ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని, వయోపరిమితి తదితర అంశాల్లో అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అధికంగా చేరడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు భద్రత చర్యలు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్