తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఉద్రిక్తతల పై రాష్ట్ర హోం శాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను గుర్తించాలని, ఈ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో డిజిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు : తెలంగాణ హైకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)