మలిన మనస్కులారా, ఇంకా ఎన్ని యుగాలు?
గుండెల్లో పచ్చబొట్టులా ఈ కులాల గాట్లు?
సింహాసనం ఎక్కినా, వయసు మళ్లినా...
మీ మనువాద చూపులకు చులకనేనా?
రాజ్యాంగ పీఠాన నిలబడిన మనిషి,
పోరాటాల దారిలో పండిన శిఖరం,
మీ కళ్లకు మాత్రం ఇంకా వర్ణపు గీతేనా?
హల్ద్వానీ వీధుల్లో చిమ్మిన అహంకారం
మీ మానసిక దౌర్భాగ్యపు అసలు రూపం!
నెత్తురు ఒక్కటే, శ్వాస ఒక్కటే,
మట్టిలో కలసిపోయే మనుషులమంతా ఒక్కటే...
మరి ఎక్కడిదీ ఆధిపత్యపు దయ్యం?
ఏ దేవుడు చెప్పాడు ఈ అస్పృశ్యత పాపం?
దేశం అంతరిక్షానికి అడుగులు వేస్తుంటే,
మీ ఆలోచనలు మాత్రం అడుగుబొందలకేనా?
కులాన్ని చూసి పక్కకు నెట్టే గుణం ఉంటే...
మీరు నాగరికులు కారు, కటిక చీకటి కోణాలు!
సిగ్గుపడండి! ఆత్మవంచన చాలించండి!
మనిషిని మనిషిగా గౌరవించని నాడు...
మీరు నడిపే సమసమాజం ఒక బూటకం,
మీరు నిరంతరం మోసేది అజ్ఞానపు పాతకం!
– మర్రాపు వసుంధరా దేవి
94414 67660
అజ్ఞానపు గాట్లు!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)