సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విరామం..

2 గంటల క్రితం

poerty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ దినము నిర్విరామంగా గడిచిపోయింది
ఇసుక తుపాను ఈదుతూ
శూన్యంలో జీవించటం అతి పెద్ద కష్టం
అలల తాకిడికి వొరుసుకు
పోయిన ఒడ్డు హృదయం
క్షణం బతకటం మరో క్షణం
ముక్కలైన వెయ్యో భాగం
వెలుగునీడలు వెంటాడుతున్న ఒంటరితనం
ఒకింత వాడి కాసింత పచ్చబడిన జీవితం
తన తడి నీడల జ్ఞాపకాలు
మంచు పూల లసుగందాలు మరో మార్మీకం
ఇష్టా సరాగాలు, ఇంద్రధనస్సులోని వర్ణాలు
కాసేపూ నిలబడవు
ఇరు సంధ్యల పొదరిల్లు
విద్యుల్లతల మెరుపు కాంతులు
ఎటు మాయమయ్యెనో మరి!
ఎరిగిన కలల్ని కళ్లల్లోకి వంపుకోవటం ఎలాగో తెలిస్తే బాగుండేది
పగలు సరే
రేపటి రాత్రి ఎలా నిద్రపుచ్చాలి
చకోరమై గగనమంతా ఎలా చుట్టి రావాలి
ఇక సంధ్య ముంచుకొస్తుంది మబ్బుల తేరు మీద
చీకటి ద్వారాలు దించుతూ
స్వప్నానికి స్వప్నానికి మధ్య ఒక మెలకువ
కాలానికి కన్నీటికి మధ్య చిన్న విరామ చిహ్నం!
- లోసారి సుధాకర్
99499 46991

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్