ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వేచ్ఛా దర్శనం

1 గంట క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 01:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏ అనంతం నుంచో
అనాలోచితంగా రాలిపడేది కాదు,
ఆకాశం కురిపించే కరుణా కాదు!
​గూటి గోడల మధ్య
నిశ్శబ్దంగా గడిచిన ప్రతి క్షణమూ,
సంకెళ్ల బిగుతును తాకి
గాయపడిన ప్రతి స్పర్శకూ ఒక అర్థముంది!

బంధనపు గాఢాంధకార లోతుల్లో
నిజస్వరూపాన్ని దర్శించుకున్నాక,
అదే చైతన్యపు గుళిక
అంతరంగాన్ని శుభ్రం చేస్తుంది.

బాహ్య ప్రపంచపు హద్దులన్నింటినీ దాటి,
ఏ వైపు సాగాలో నిర్ధారిస్తుంది.
ఇదే నిజం!

చీకటి–వెలుగుల సంభ్రమ కాంతిలో
తనను తాను ఆవిష్కరించుకోవడమే
నిజమైన స్వేచ్ఛ.

- వైష్ణవి శ్రీ
​80742 10263

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్