సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న..

1 గంట క్రితం

question
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 05:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అతడు నేలపై నిలబడ్డాడు

మాపై ప్రేమల వర్షం కురిపించాడు

అతడు సింహాసనంపై కూర్చున్నాడు

నాపై రాళ్లు విసిరాడు


ఎదురొడ్డాను

ఆమెపై అకృత్యాలు చేశాడు

కవచంలా నిలబడ్డాను

కులంపైనా, మతంపైనా

నాలుగు రాళ్లు వేశాడు

వాడి ఆలోచన అర్థమైంది

మౌనం బద్ధలైంది

ప్రశ్నలు నిప్పుల్లా కురిపించాను

అతడు ఊసరవెల్లి అయ్యాడు

నేను మహాసంగ్రామానికి

శంఖం పూరించాను

నా ఘోష జనప్రవాహమైంది

నన్ను శ్రీకృష్ణ జన్మస్థానంలో బందీని చేశారు


ప్రశ్న...

నల్లచొక్కా వేసుకొని ఊరేగుతుంది!

- రెడ్డి శంకరరావు

94943 33511

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్