సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన... మార్కుల సాధనకు ధీమా

1 గంట క్రితం

education
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఎపి టెట్‌ 2026-ప్రిపరేషన్‌

ఏపీ టెట్ (AP TET 2026)పరీక్షలో నేరుగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ విభాగాలు లేకపోయినప్పటికీ,ఈ ప్రిపరేషన్ మీకు త్వరలో జరగబోయే AP DSC (ఉపాధ్యాయ నియామక పరీక్ష)లో అత్యంత కీలకంగా మారుతుంది. ఎందుకంటే టెట్ సిలబస్‌లోని 'పరిసరాల విజ్ఞానం (EVS)', 'సాంఘిక శాస్త్రం (Social Studies)' అంశాలు కరెంట్ అఫైర్స్‌తో ముడిపడి ఉంటాయి. టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు 2026టెట్,డీఎస్సీలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ అఫైర్స్ను అభ్యర్థులు ఓ క్రమపద్ధతిలో నేర్చుకుని ప్రిపేర్‌ అయితే విజయాన్ని అందుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగానూ,దేశంలోనూ,సమాజంలోనూ జరుగుతున్న వివిధ సంఘటనలు,అభివృద్ధి అంశాలు,కొత్త ఆవిష్కరణలు,పరిశోధనలు వంటి తాజా అంశాలు తెలుసుకోవాలి.వాటిని గుర్తుపెట్టుకోవాలి.పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ (GK),కరెంట్ అఫైర్స్విభాగాల్లో గరిష్ఠ మార్కులు సాధించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ ఎంతో ముఖ్యం.నిరంతర సాధన, సరైన వనరుల ఎంపిక మరియు క్రమబద్ధమైన రివిజన్ ద్వారా ఈ విభాగాలపై పట్టు సాధించొచ్చు.

1.విద్యా రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ (Education-Centric Updates):

ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు విద్యా రంగానికి సంబంధించిన పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ప్రభుత్వ పథకాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగానికి అమలు చేస్తున్న

పథకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

2.స్టాటిక్ సబ్జెక్టులతో లింక్ చేయడం(Linking with EVS & Social)

టెట్ పేపర్-1లోనిEVS,పేపర్-2లోని సోషల్ స్టడీస్ కాంటెంట్‌ను కరెంట్ అఫైర్స్‌తో కలిపి చదవాలి.

పర్యావరణం(Environment):ఇటీవల వార్తల్లో నిలిచిన జాతీయ పార్కులు,వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పర్యావరణ ఒప్పందాలు, వాతావరణ మార్పులపై సదస్సులు.

3.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలు (AP State Current Affairs)

4.టెట్/డీఎస్సీ కోసం అనుసరించాల్సిన ప్రణాళిక(Execution Plan)

5.రోజువారీ వార్తాపత్రిక పఠనం (Daily Newspaper Reading)

సిలబస్ పరిజ్ఞానం: పత్రికలో వచ్చే రాజకీయ వివాదాలు,నేరాలు,సినిమా వార్తలను వదిలేసి...జాతీయ,అంతర్జాతీయ పరిణామాలు, సైన్స్&టెక్నాలజీ,ఆర్థికాంశాలు,సంపాదకీయ పేజీలపై (Editorials)ఎక్కువ దృష్టి పెట్టండి.

6.సొంత నోట్స్ తయారీ (Micro-Notes Making)

స్టాటిక్GKలింకింగ్:ఏదైనా ఒక ప్రాంతం లేదా సంస్థ వార్తల్లో నిలిస్తే (ఉదాహరణకు: ISRO కొత్త ప్రయోగం),దానికి సంబంధించిన స్టాటిక్ సమాచారాన్ని(స్థాపించిన సంవత్సరం,ప్రధాన కార్యాలయం)కూడా అక్కడే నోట్ చేసుకోండి.

7.ప్రామాణిక వనరులు &మ్యాగజైన్స్(Standard Resources)

8.నిరంతర రివిజన్ (Regular Revision)

9.ప్రాక్టీస్ టెస్టులు &మాక్ ఎగ్జామ్స్ (Mock Tests)

సమకాలీన అంశాలపై అవగాహన

మన చుట్టూ ఉన్న ప్రపంచం,చరిత్ర,భౌగోళికం,రాజకీయాలు,సమకాలీన విషయాలపై అవగాహన పెంచుకోవడమేజనరల్ నాలెడ్జ్ (GK).ఇది పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి,మంచి ఉద్యోగం పొందడానికి మరియు సమాజంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటానికి ఎంతో అవసరం.UPSC, TSPSC, APPSC, బ్యాంకింగ్,రైల్వే వంటి అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగ నియామక పరీక్షల్లోGK, కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

వ్యక్తిగత వికాసం,ఆత్మవిశ్వాసం:జనరల్ నాలెడ్జ్ మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది.వివిధ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల ఇతరులతో చర్చల్లో మరియు ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనవచ్చు

సరియైన నిర్ణయాలు: మన దేశ ఆర్థిక వ్యవస్థ,రాజ్యాంగం మరియు ప్రపంచ పరిణామాలను తెలుసుకోవడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

నిరంతర అభ్యాసం:సమాచారం తెలుసుకోవాలనే కుతూహలం,రోజూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటును పెంపొందిస్తుంది.

నాలుగు అంశాలు కీలకం...

ప్రతి పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ అనేది ఒక అనివార్యమైన భాగం.భారతదేశం అంతటా నిర్వహించే పోటీ పరీక్షలు సాధారణంగా నాలుగు ప్రధాన విభాగాల నుండి ప్రశ్నలు అడిగారు అంటే జనరల్ నాలెడ్జ్,రీజనింగ్,ఇంగ్లీష్,మ్యాథమెటిక్స్.జనరల్ నాలెడ్జ్ అనేది ఒక సబ్జెక్ట్.దీని ప్రిపరేషన్‌ కు ఎక్కువ సమయం కావాలి.అభ్యర్థులు సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. గ్రూప్స్,పోలీస్,సివిల్స్,ఆర్‌ఆర్‌బీ,ఎస్‌ఎస్‌సీ,బ్యాంక్,పోస్టల్,స్కూల్‌ టీచర్, పంచాయతీ సెక్రటరీ,ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఇలా.అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన,సాధారణ పరిజ్జానాన్ని(జనరల్‌ నాలెడ్జ్‌),కరెంట్‌ అఫైర్సు ద్వారా పెంపొందించుకోవచ్చు.

ఈ క్రింది కొన్ని మాదిరి ప్రశ్నలు-వాటి జవాబులు ఇస్తున్నాం.పరిశీలించగలరు.

(1) UNESCOప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : పారిస్‌

(2) ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ (OPEC)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : లండన్

(3)ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : పారిస్

(4) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : జెనీవా

(5) ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? :గురుగ్రామ్(హర్యానా)

(6) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? :తిరువనంతపురం

(7) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? : శ్రీ హరికోట

(8) భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? :న్యూఢిల్లీ

(9) కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? : కటక్(ఒరిస్సా)

(10) హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? :మేజర్ ధ్యాన్ చంద్

(11) క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించినది? : ఉద్గార వాయువు

(12) మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించినది? : ఓజోన్ పొర రక్షణ

(13) రామ్‌సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించినది? : చిత్తడి నేలల రక్షణ

(14) ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? :వాషింగ్టన్ డిసి

(15) ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : మనీలా

(16) యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? : నైరోబి,కెన్యా

(17) ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? :జెనీవా

(18) ఫాల్కన్9 రాకెట్‌ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? : స్పేస్-X

(19) HOPE మిషన్‌ను ఏ దేశం ప్రారంభించింది? : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

(20)యాపిల్‌లో ఉండే యాసిడ్ ఏది? : మాలిక్ ఆమ్లం

(21) చింతపండులో ఏ యాసిడ్ ఉంటుంది? : టార్టారిక్ ఆమ్లం

(22) పాలు,పెరుగులో ఏ యాసిడ్ ఉంటుంది? : లాక్టిక్ ఆమ్లం

(23) వెనిగర్‌లో ఏ యాసిడ్ ఉంటుంది? : ఎసిటిక్ ఆమ్లం

(24) ఎర్ర చీమ కుట్టడంలో ఏ ఆమ్లం ఉంటుంది? : ఫార్మిక్ ఆమ్లం

(25) నిమ్మ మరియు పుల్లని ఆహారాలలో ఏ యాసిడ్ ఉంటుంది? : సిట్రిక్ యాసిడ్

(26) కిడ్నీ స్టోన్‌ని ఏమంటారు? : కాల్షియం ఆక్సలేట్

(26) ప్రోటీన్ జీర్ణక్రియకు ఏ యాసిడ్ ఉపయోగపడుతుంది? : హైడ్రోక్లోరిక్ ఆమ్లం

(27) సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? : కేరళ

(28)భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? : ద్రౌపది ముర్ము

(29):_భారత రాజ్యాంగంలోని ఏ సవరణ లోక్‌సభ,రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించింది? : 106వ సవరణ చట్టం, 2023

(30) సింధు లోయ నాగరికత యొక్క మొహెంజో-దారో నగరం ఏ సంవత్సరంలో కనుగొనబడింది? : 1922

(31) 2026సంవత్సరానికి భారతదేశం యొక్క సుమారు నామమాత్రపు GDPఎంత? : _$4.51 ట్రిలియన్లు


- కె.ఎస్.లక్ష్మణరావు,

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు,

మాజీ శాసనమండలి సభ్యులు,

సెల్: 8309965083

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్