ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హరివిల్లు

2 గంటల క్రితం

rainbow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హరివిల్లు... హరివిల్లు

సప్తవర్ణాలతో విరజిల్లు.

ఊదా, ఇండిగో, నీలం, పచ్చ,

పసుపు, నారింజ, ఎరుపు

హరివిల్లుకు అందించు మెరుపు!


నీటి చినుకు గాలిలో ఉంటే,

సూర్యకాంతి దానిపై పడితే,

వంగి తిరిగి రంగులు చిందితే,

హరివిల్లయి ఆకాశం నవ్వే..!


వర్షం తగ్గి మేఘాలు తొలగగా,

సూర్యకిరణాలు భూమిని తాకగా,

తడి నేల నుండి మట్టివాసన రాగా,

హరివిల్లు చూసి పిల్లలు కేరింతలెత్తగా!


ఎరుపు రంగు ధైర్యం నేర్పు,

నారింజ రంగు ఉత్సాహం ఇచ్చు,

పసుపు రంగు ఆనందం పంచు,

పచ్చ రంగు ప్రకృతికి గుర్తు!


నీలం ఆకాశపు విశాలతను,

ఇండిగో రాత్రి కలలను,

ఊదా రాజసపు ఠీవిని,

ఏడు రంగులు మనకి నేర్పు!


వర్షం ఆగిన వెంటనే,

సూర్యుడు వెనకాల ఉంటేనే,

మన ముందు తడి మేఘాలుంటేనే,

హరివిల్లు పూస్తుంది ఆకాశమంతా!


హరివిల్లు... హరివిల్లు

సప్తవర్ణాలతో విరజిల్లు,

మనసంతా విరిజల్లు,

ఆనందాల హరివిల్లు!


— మొర్రి గోపి,

కవిటి, శ్రీకాకుళం జిల్లా.

88978 82202.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్