వాన కురవలేదు
కప్పల పెళ్లి చేస్తుండ్రు
ముత్యాలమ్మకి మొక్కుతుండ్రు
మౌఢ్యం శాస్త్రానికి తూగదు
నూటెనిమిది నోటి వాక్కులతో
సానుకూల తరంగాలే సృష్టించబడితే
‘అన్నమో రామచంద్రా’ ఆర్తనాదాలతో
ఉప్పెనలే రావాలిగా!
పదకొండు గుండాల్లో ప్రజాధనాన్ని పోసి
మబ్బును మభ్యపెట్టే యాగానికి
పూనుకున్నాడు ఏలిక
ఇంధనం లేక జనం విలవిల
కట్టెలు రేపు మండుతాయి గుండాల్లో
పాడి లేక ఊరు బక్కచిక్కింది
ఆజ్యం మంటకు తోడై ఉవ్వెత్తున ఎగుస్తుంది
పౌష్టికాహారం కొరవడి అచేతనంలో బాల్యం
గుమ్మడికాయలు పగులుతాయి విరివిగా
కట్టుకునే బట్ట లేక ఎందరో
పట్టు వస్త్రాలు అగ్నికి ఆహుతి అవుతుంటే
నిశ్చేష్టులై చూడాలంతే!
పెట్టుబడికి చెట్టు కొండ గుట్ట అర్పించాక
వాన ఎట్లు కురియు?
నల్లని ఆవులు నల్లని ధోవతులు
నల్లని మబ్బులను ఏమార్చుతాయనే నమ్మికలో
జనాన్ని ఏమార్చే ప్రజాస్వామ్యమా,
జోహార్లు!
– గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201
కొంగ జపం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)