ఎన్ని పెద్ద కళ్లుంటేనేం!
ఎంత అర్జునుడి చూపైతేనేం!
మనసు... కాకులు దూరలేని రహదారి.
అక్కడెక్కడో వినిపించే ఘోష నీ చెవిని తాకుతుంది
నలిగిన, చిరిగిన బతుకుల విస్తరి నీ కంటి ముందు
హృదయ విదారక చిత్రాన్ని
అప్పుడే పుడుతుంది నీలో ఓ చైతన్య కవనం...
కానీ, నీ పక్కన ఆకలి కేకల నీడలు
అవయవలోపపు చారలు
నీ చూపు కాసేపు నిద్రపోతుంది
మేలుకున్న కనుదోయి
అసహ్యాల ఎరుపును నింపుకుంటుంది
అప్పుడే నీ అక్షరం
చేతకాని, చేవలేనితనమంటూ
ఆరోపణల శ్రుతిని ఎత్తుకుంటుంది
అందుకే...
అక్కడ నీ అక్షర జెండాకు అభిషేకం!
ఇక్కడ నీ కర్కశ గుండెకు నిలువుటద్దం!
మరి... ఏది నీ నిజ స్వరూపం?!
- రాధకృష్ణ కర్రి
99519 16499








కామెంట్‌లు (0)