శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం అభ్యర్థుల ముమ్మర ప్రచారం...

4 రోజుల క్రితం

campaigning by CPM candidates for ZPTC and MPTC elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 11:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : జెడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సెగ్మెంట్లలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశాయి. కరపత్రాలను పంచుతూ విస్తృత ప్రచారం చేశాయి. ప్రజా సమస్యలు, పేదల హక్కులు, గిరిజనుల జీవనాధారాల పరిరక్షణ కోసం సిపిఎం సాగిస్తున్న పోరాటాలను వివరిస్తూ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించాయి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరాయి.

అనంతపురం పుట్లూరు, కనగానపల్లి జెడ్‌పిటిసి, అమరాపురం, చిలమత్తూరు మండలం కొట్నూరు-2 ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికల ప్రచారాలు కొనసాగాయి. అనంతపురం రూరల్ మండలం రాజు కాలనీ పంచాయతీ ఎంపిటిసి - 2 సిపిఎం అభ్యర్థి మసూద్ వలిని గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వి రాంభూపాల్‌ ‌ప్రచారం చేశారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం, నందిపాడు ఎంపిటిసి అభ్యర్థి గుజ్జుల మల్లికార్జునకు మద్దతుగా ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలతో ధూంధాం ప్రచారం నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జెడ్‌పిటిసి అభ్యర్థి కవురు లక్ష్మి, పెనుమంట్ర జెడ్‌పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్, పెనుమంట్ర -2 ఎంపిటిసి అభ్యర్థి కోడి లక్ష్మి, ఎంపిటిసి అభ్యర్థులు చల్లా శ్రీనివాస్, గెద్దాడ వెంకటేశ్వరరావు, కాళ్ల ఎంపిటిసి అభ్యర్థి గొర్ల రామకృష్ణ, తణుకు మండలం అభ్యర్థి బళ్ల_చిన్నవీరభద్రరావు, ఎంపిటిసి అభ్యర్థి బొర్రా అలమహారాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎంపిటిసి అభ్యర్థి బొరగం భూచంద్రం, జీలుగుమిల్ల మండలంలోని అంకన్నగూడెం ఎంపిటిసి అభ్యర్థి కొవ్వాసి రామలక్ష్మి విస్తృత ప్రచారం చేశారు.

campaigning by CPM candidates for ZPTC and MPTC elections

అల్లూరి జిల్లా అరకులోయ మండలం అరకులోయ జెడ్‌‌పిటిసి అభ్యర్థి గెమ్మిలి చిన్నబాబును గెలిపించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స ప్రచారం నిర్వహించారు. డుంబ్రిగుడ మండలం జెడ్‌పిటిసి అభ్యర్థి ఎస్‌బి పోతురాజు, ముంచంగిపుట్టు జెడ్‌‌పిటిసి అభ్యర్థి కొర్రా త్రినాథ్‌, అనంతగిరి ఎంపిటిసి అభ్యర్థి దీసరి గంగరాజు ప్రచారానికి ఆదరణ దక్కుతోంది. పోలవరం జిల్లా రాజవొమ్మంగి జెడ్‌‌పిటిసి అభ్యర్థి లోతా రామారావు, మారేడుమిల్లి జెడ్‌‌పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ పుల్లంగి, చింతూరు జెడ్‌‌పిటిసి అభ్యర్థి మిడియం శ్రీదేవి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు.

​ విఆర్‌ పురం మండలం నాగేంద్రపురం ఎంపిటిసి అభ్యర్థి సున్నం రాజులు మాస్టారు, జీడిగుప్పలో ఎంపిటిసి అభ్యర్థి కోణాల శేషమ్మ వాగులు దాటుతూ, గోదారిపై పడవల్లో ప్రయాణం చేస్తూ నిర్వాసిత గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి జెడ్‌‌పిటిసి అభ్యర్థి కాళ్ల తేలయ్య బాబు, అచ్యుతాపురం జెడ్‌‌పిటిసి గంగిరెడ్డి నారాయణమ్మ ప్రచారం చేశారు.

విజయనగరం మెంటాడ జెడ్‌పిటిసి అభ్యర్థి సిరగం శాంతి, గుర్లతమ్మిరాజుపేట ఎంపిటిసి అభ్యర్థి గేదెల పెదరాము, ఆండ్ర ఎంపిటిసి అభ్యర్థి రాకోటి రాములు, ఇప్పలవలస ఎంపిటిసి అభ్యర్థి చిలక సింహాచలమ్మ, పిట్టాడ ఎంపిటిసి అభ్యర్థి తామరపల్లి కుమారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొమరాడ మండలం గుమడ సంతలో పూడేసు ఎంపిటిసి అభ్యర్థి కొండగొర్రి మధు, చోళ్లపదం ఎంపిటిసి అభ్యర్థి ఊయక లావణ్య ప్రచారం చేశారు. కురుపాం మండలం జెడ్‌పిటిసి అభ్యర్థి పాలక నరేష్‌కు మద్దతుగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ అశోక్ ప్రచారం నిర్వహించారు. సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎంపిటిసి రెడ్డి లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆధ్వర్యాన ప్రచారం చేశారు. సీతంపేట మండలంలోని ధారపాడు ఎంపిటిసి అభ్యర్థి_జీలకర్ర సుందరమ్మ, గుమ్మలక్ష్మీపురం జెడ్‌పిటిసి అభ్యర్థి మండంగి శ్రీనివాసరావు, బాలేసు ఎంపిటిసి అభ్యర్థి పువ్వల సుబ్బారావు గెలుపును కోరుతూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్