బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబుట్టాయగూడెంలో.. సిపిఎం జెడ్‌‌పిసిటి అభ్యర్థి తెల్లం నాగమణికి ప్రజాదరణ

-104 నిమిషాల క్రితం

బుట్టాయగూడెంలో త్రిముఖ పోటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 02:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం జెడ్‌‌పిటిసి ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. గిరిజనులకు నిరంతరం అండగా ఉంటూ అనేక పోరాటాలు నిర్వహించిన తెల్లం నాగమణి జెడ్‌‌పిటిసి అభ్యర్థిగా సిపిఎం నుంచి పోటీలో ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ అధికారం చెలాయించిన ప్రధాన పార్టీలు గిరిజనుల హక్కులను హరించాయి. దశాబ్దాలుగా గిరిజనుల హక్కుల కోసం సాగుతున్న ఉద్యమాల్లో సిపిఎం అగ్రభాగాన ఉంది. బుట్టాయగూడెం ఏజెన్సీలో గిరిజనులు, మహిళలు, ఉద్యోగుల సమస్యలపై అనేక ఏళ్లుగా పలు పోరాటాలు నడిపింది. ప్రజా సమస్యల పరిష్కారమే తన జీవిత లక్ష్యంగా సిపిఎం అభ్యర్థి తెల్లం నాగమణి ముందుకు సాగుతున్నారు. ప్రజాసమస్యల కోసం పోరాడుతున్న తమ అభ్యర్థిని గెలిపించాలని, ప్రజావాణిని మండల పరిషత్ లోనూ, జిల్లా పరిషత్ లోనూ, ఐటిడిఎ సమావేశాల్లోనూ వినిపించేలా చేయాలని అక్కడి ప్రజలను సిపిఎం కోరుతూ ప్రచారం సాగిస్తోంది. ఏజెన్సీలో గిరిజనుల హక్కులతోపాటు ఎల్‌‌టిఆర్‌ ‌భూ పోరాటాలు నిర్వహించింది. వాటితోపాటు వేలాది ఎకరాల పోడు భూముల సమస్యలపైనా పని చేస్తోంది. గత పదేళ్లలో దాదాపు ఐదు వేల ఎకరాల పోడు భూములు సాధించడంలో కృషి ఎనలేనిది. గిరిజనేతరుల పేదల కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం, విద్యాధికులైన గిరిజన యువతకు ఉపాధి కోసం పోరాడుతోంది. పోడు భూములకు పట్టాలివ్వాలని, ఐటిడిఎను బలోపేతం చేసి గిరిజనులకు పథకాలు సక్రమంగా అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్‌ ‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పోగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని పోరాటాలు నిర్వహించింది.

సిపిఎం ప్రణాళిక

జెడ్‌‌పిటిసి ఎన్నికల్లోనూ తమ ప్రణాళిక ముందుగానే సిపిఎం విడుదల చేసింది. బుట్టాయగూడెం మండలంలో విద్య, వైద్య సౌకర్యాల మెరుగు కోసం కృషి చేస్తామని చెబుతోంది. రైతులకు సాగునీటి సౌకర్యం, విద్యుత్‌, పంటలకు గిట్టుబాటు ధరల కోసం కృషి చేస్తామని ప్రకటించింది. గిరిజన యువతకు ఉపాధి కోసం జిఒ నెంబర్‌ 3 అమలుకు కృషి, గిరిజన యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కోసం కళాశాలలు, పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తామంటూ ప్రచారం నిర్వహిస్తోంది. గిరిజన యువతకు స్కిల్ డెవల‌ప్‌‌మెంట్‌‌కు శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం కృషి చేస్తామని, ఐటిడిఎలో పథకాల అమలు, అర్హులకు అందేలా కృషి చేస్తామని, రోడ్లు, కల్వర్టులు అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొంది. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే నిరంతర పోరు సాగుతుందని స్పష్టం చేసింది.

పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం - ​తెల్లం నాగమణి

‘పదేళ్లుగా సిపిఎం నేతగా మహిళలు, కార్మికుల సమస్యలపై నిరంతరం పని చేస్తున్నాను. మండలంలో అంగన్‌‌వాడీ, ఆశా కార్యకర్తలు మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్స్, ఐటిడిఎలో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్ల సమస్యలపై, వారి జీతాలు, రావాల్సిన ఇతర సౌకర్యాలు గురించి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం. వారిని పర్మినెంట్ చేయాలని, అనేక సమస్యలపై ఎన్నో పోరాటాలు ముందుండి నడిపాం. జిఒ నెం.3 పునరుద్ధరించాలని జరిగిన ఉద్యమాల్లో గిరిజనుల తరఫున పెద్ద ఎత్తున పోరాడాం. దశాబ్దకాలంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్