ప్రజాశక్తి-అమరావతి : ఆర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలను చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అర్నబ్ కారణంగా 25 వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగి ఉంటుందని చెప్పారు. కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నెలరోజులపాటు రేషన్ ఇవ్వాలని కోరారు. తుఫాను సహాయక చర్యల్లో సిపిఎం కార్యకర్తలు పాల్గొంటారని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. సిపిఎం పార్టీ తరఫున బాధితులకు సంఘీభావం ప్రకటించారు.
Print Editionయుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: సిపిఎం డిమాండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)