బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం

1 గంట క్రితం

Spain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మాడ్రిడ్‌ : స్పెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్‌ స్పెయిన్‌లో రెండు హైస్పీడ్‌ రైళ్లు ఢీకొనడంతో 30 మంది మరణించారు. బుధవారం ఉదయం టొలెడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్పెయిన్‌ రైల్వే వ్యవస్థ నిర్వాహక సంస్థ (ఎడిఐఎఫ్‌) తెలిపింది. దీంతో మాడ్రిడ్‌, సియుడాడ్‌ రియల్, అండలూసియా మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. ఒకే దిశలో ప్రయాణిస్తున్న రెండు హైస్పీడ్‌ రైళ్లు, ఒకదానిని వెనుక నుండి మరో రైలు ఢీకొందని, దీంతో రెండు రైళ్ల బోగీలు పట్టాలు తప్పాయని తెలిపింది. ఈ ప్రమాదంలో 30మంది మరణించగా, వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని ఉర్దా పట్టణ మేయర్ మాన్యుయెల్ గలాన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.

జనవరిలో, దక్షిణ స్పెయిన్‌లో ఒక రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొనడంతో 45 మంది మరణించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్