ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం : ఎస్ఈసీ పునేఠా

1 గంట క్రితం

Strict action will be taken if peace and order are disrupted during the election period: SEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పల్నాడు, అనంతపురం జిల్లాల్లో రీపోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా చాలావరకు ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ కుమార్ పునేఠా వెల్లడించారు. రు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు అందిన తర్వాత రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ సరళిని వివరించారు.

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, విజయవాడలో చిన్నపాటి సమస్య తలెత్తినప్పటికీ వెంటనే పరిష్కరించామని తెలిపింది. పులివెందుల ఘటనకు సంబంధించి నివేదిక అందిన తర్వాతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

కలెక్టర్, ఎస్పీ సమర్పించే నివేదికల ఆధారంగానే రీపోలింగ్‌పై తుది నిర్ణయం ఉంటుందన్నారు. రిగ్గింగ్ జరిగినట్లు కలెక్టర్, ఎస్పీ నివేదికలో స్పష్టంగా పేర్కొంటే వెంటనే రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.

మరోవైపు, పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు. రీపోలింగ్ నిర్వహిస్తేనే తిరిగి వచ్చి ఓటు వేస్తానని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్ఈసీతో పాటు అధికారులు చంద్రబాబు మనుషులుగా మారిపోయారంటూ ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన ఘటనలపై హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్