స్థానిక పోరులో సిపిఎం విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - యంత్రాంగం : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్నికల ప్రచారం ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మున్సిపల్ వార్డులు, జెడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
విజయవాడ 30వ డివిజన్లో అభ్యర్థి దోనేపూడి కాశీనాథ్ ప్రచార సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ, ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండే నిబద్ధత గల కమ్యూనిస్టు అభ్యర్థులను ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారానే నగర ప్రజల హక్కులు రక్షించబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, బి తులసీదాస్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవనంలో సిపిఎం వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ సిఐటియు ఆధ్వర్యాన కరపత్రం విడుదల చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జెడ్పిటిసి అభ్యర్థి మండంగి శ్రీనివాసరావు, ఎంపిటిసి అభ్యర్థి పువ్వుల దుర్గారావు ప్రచారం చేశారు. సీతంపేట మండలంలోని పూతికవలస ఎంపిటిసి అభ్యర్థి మండంగి కాంతారావు పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో జెడ్పిటిసి అభ్యర్థి సరగం శాంతి, ఎంపిటిసి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.
శ్రీకాకుళం ఎచ్చెర్ల_జెడ్పిటిసి అభ్యర్థి పొందూరు చంద్రరావు, మందస జెడ్పిటిసి అభ్యర్థి రుష్యశృంగ బినితకుమారి, టెక్కలి ఒకటో ప్రాదేశిక ఎంపిటిసి అభ్యర్థి నంబూరు షణ్ముఖరావు, జెడ్పిటిసి అభ్యర్థి కొల్లి ఎల్లయ్య, పలాస సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి తెప్పల అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగరంలో 23వ వార్డు, 25వ వార్డుల అభ్యర్థులు సందక ఉదయ్ కుమారి, బివి వర్మ, 18వ వార్డు అభ్యర్థి సుజాత, ఏలూరు 34 డివిజన్ సిపిఎం అభ్యర్థి ఎర్ర రాంబాబు ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగింది.
ఉంగుటూరు మండలం భువనపల్లి ఎంపిటిసి-2 అభ్యర్థి నారపల్లి నానినరేష్, పెనుమంట్ర జెడ్పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్, కాళ్ల ఎంపిటిసి -1 అభ్యర్థి గొర్ల రామకృష్ణ, పోలవరం మండలం వింజరంలోని ఎంపిటిసి అభ్యర్థి బొరగం బూచంద్రం, జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం ఎంపిటిసి అభ్యర్థి కొవ్వాసి రామలక్ష్మి, జెడ్పిటిసి అభ్యర్థి అసిరియ్య శేషపు, ఎంపిటిసి-1 అభ్యర్థి చల్లా శ్రీనివాస్, ఎంపిటిసి-2 అభ్యర్థి గెద్దాడ వెంకటేశ్వరరావులు, భీమవరం మండలం మోగల్లులోని సిపిఎం జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు వీధి వీధినా తిరుగుతూ ప్రజలను ఓట్లను అభ్యర్థించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం 21వ వార్డు అభ్యర్థి గౌరోజు వీరబాబు, సామర్లకోట 32వ వార్డు అభ్యర్థి బాలం హరిబాబు, పెద్దాపురం 16వ వార్డు అభ్యర్థి నెక్కల మంగ, 20వ వార్డు అభ్యర్థి కూనిరెడ్డి అప్పన్న, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు 6వ వార్డు అభ్యర్థి జువ్వల రాంబాబు, కొవ్వూరు 20వ వార్డు అభ్యర్థి దగ్గు అశోక్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 17వ వార్డు అభ్యర్థి సఖిలే సూర్యనారాయణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సామర్లకోటలో బాలం హరిబాబును గెలిపించాలంటూ బైకు ర్యాలీ నిర్వహించారు. తాళ్లరేవులో కోరంగి-3 ఎంపిటిసి అభ్యర్థి టేకుమూడి ఈశ్వరరావు, తాళ్లరేవు ఎంపిటిసి-2 నేరేడుమిల్లి త్రిమూర్తులు ఇంటింటా ప్రచారం చేశారు.
ఒంగోలులో మూడో డివిజన్ అభ్యర్థి కె వంశీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా 37 డివిజన్ అభ్యర్థి షేక్ రఫీ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ప్రచారం చేశారు.
అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 25, 60, 62 వార్డుల అభ్యర్థులు సాకే సరస్వతి, సి గీత, ఎ గుల్జార్, గుంతకల్లు పట్టణంలో 17, 34, 40 వార్డుల అభ్యర్థులు యాకపోతు జయమ్మ, హోసూరు సరస్వతి, యబుటం చిన్న వీరన్న, గుత్తి మున్సిపాల్టీ 24 వార్డు అభ్యర్థి వి నిర్మల, శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి పట్టణం 39వ వార్డు అభ్యర్థి ముస్తక్ ఆలీఖాన్ విస్తృత ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రెండో వార్డు అభ్యర్థి ఆర్ఎస్ఎన్ మూర్తి, 66వ వార్డు అభ్యర్థి బొట్టా ఈశ్వరమ్మ ,13వ వార్డు అభ్యర్థి ఎస్ గౌరి, 16వ వార్డు అభ్యర్థి ఎస్ రంగమ్మ విస్తృత ప్రచారం చేశారు. 105వ వార్డు అభ్యర్థి ఎం కృష్ణయ్యకు మద్దతుగా ప్రజానాట్యమండలి కళాకారులు ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి మండల జెడ్పిటిసి అభ్యర్థి కాళ్ల తేలయ్యబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. అచ్యుతాపురం జెడ్పిటిసి అభ్యర్థి గంగిరెడ్డి నారాయణమ్మ, పోలవరం జిల్లా విఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి ఎంపిటిసి అభ్యర్థి సున్నం రాజులు, ములకలపల్లి ఎంపిటిసి అభ్యర్థి సొంది నాగమణి, రేఖపల్లి ఎంపిటిసి అభ్యర్థి చింతకాయల రజిని, విఆర్.పురం జెడ్పిటిసి అభ్యర్థి కారం సుజాత, చింతూరు జెడ్పిటిసి అభ్యర్థి మిడియం శ్రీదేవి, ఎంపిటిసి అభ్యర్థులు సీసం సురేష్, మడకం రమేష్, సారమ్మ, కుంజా ప్రసాదు, కారం నాగేష్, బొక్కిలి కన్నారావు, మారేడుమిల్లి జెడ్పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ ప్రచారం నిర్వహించారు. రాజవొమ్మంగి జెడ్పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలని కోరుతూ జరిగిన ప్రచారంలో ఆదివాసీ జెఎసి జిల్లా నాయకులు వంతు బాలకృష్ణ, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఎవి నాగేశ్వరరావు, జి రామన్న, కె ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఎంపిటిసి అభ్యర్థి కొర్రా అరుణ, పాడేరు మండలం మినుములూరు ఎంపిటిసి అభ్యర్థి లింగేరి సుందర్ రావు గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.









కామెంట్లు (0)