ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్ లో ఈ దశాబ్దంలో నిరుపేదలు గణనీయంగా తగ్గారు. రోజుకి మూడు డాలర్లకు తక్కువగా వినియోగం చేయగలిగిన వారు దశాబ్దం క్రితం 26 శాతం ఉండగా, వారు 2.6 శాతం మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకొంచెం పై స్థాయి పేదలు కూడా తగ్గారు. మరో పద్ధతి- మల్టి డైమెన్షనల్ పావర్టీ - లెక్కలు కూడా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్తోంది. చాలా సంతోషించాల్సిన విషయం. అయితే ఈ నివేదిక చెప్తున్నంత మంచి నిజంగా జరిగిందా? ఆ స్థాయిలో పేదరికాన్ని జయించామా? లేక లెక్కపెట్టే తీరులో ఏమైనా తేడా ఉందా? అన్నవి తొలుస్తున్న ప్రశ్నలు. కోట్లాది ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందిస్తుంది. ఎందుకంటే అలా అందించక పోతే వారికి మనుగడ లేదు. ప్రపంచ దేశాల సరసన ఆకలి సూచీలో 100వ స్థానంలో, పోషకాహార లేమిలో, శిశు మాతృ ఆరోగ్య సూచీల్లో వెనుకబాటు స్థానాల్లో ఉన్నాం. కార్మిక గణాంకాలు, నిరుద్యోగ గణాంకాలు ఆశాజనకంగా లేవు. వాటికీ, ఈ ప్రపంచ బ్యాంకు లెక్కలకు పొంతన కుదరడం లేదు. పెరిగే ధరలు, ఉపాధి లేమి, నిలకడ లేని ఆదాయాలు, తగ్గుతున్న ఉద్యోగాలు, ఖరీదైన విద్యా, వైద్యాలు ప్రజల్ని పేదరికం వైపే నెడుతున్నాయి. పరిస్థితి అంతా బాగుంది అంటే నమ్మడం కష్టమౌతుంది. ఇది నిరాశ తోనో, వ్యతిరేకత తోనో చెప్తున్నది కాదు. కళ్లెదుట వాస్తవం.
- డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం






కామెంట్లు (0)