సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగ్లాదేశ్ సరిహద్దులో 15 కిలోల అక్రమ బంగారం పట్టివేత

1 గంట క్రితం

15 kg of smuggled gold seized at the Bangladesh border.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 10:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బంగ్లాదేశ్ : పశ్చిమబెంగాల్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ అనుమానాస్పద మహిళ వద్ద అక్రమంగా దాచి ఉంచిన 15 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని జవాన్లు గమనించారు. అనంతరం ఆమెపై నిఘా పెట్టారు. ఆ మహిళ ఇంట్లో బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేయగా, 15.6 కిలోల దాచిన బంగారం బయటపడింది. ఆ బంగారాన్ని సీజ్ చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. ఆ మొత్తం బంగారం విలువ రూ.24 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం బంగ్లాదేశ్ సరిహద్దుకు ఎలా చేరింది ? దానిని ఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్