మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పథకం మారిన కార్యాలయం బోర్డు మారలేదు..!

31 ఆగస్టు, 2026

The office has changed its banner, but the signboard remains the same!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎంజిఎన్ఆర్జిఎస్ పేరుతో ఉపాధి హామీ కార్యాలయం


ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ఉపాధి హామీ పథకం స్థానంలో విబి జీరామ్ జీ పథకమును తీసుకొచ్చిన ఆత్మకూరు మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్యాలయం కి నేటికీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం పేరే కొనసాగుతూనే ఉంది ఈ పథకం పేరు ప్రభుత్వం జులై ఓట్ నుంచి నూతనంగా కేంద్ర ప్రభుత్వం విబి జీ రామ్ జీ పథకంలో అమలులోకి తెచ్చిన ఇక్కడ మాత్రం అధికారులు కార్యాలయం పేరు మాత్రం మార్చుకున్న పాత పేరుతోనే కార్యాలయం నిర్వహిస్తుండటం ఆశ్చర్యం గురిచేస్తుంది కొత్త పథకం అమలులోకి వచ్చి దాదాపు గడుస్తున్నా కూడా పేరు మార్చుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం తద్వారా కూలీలకు చేకూరే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసేలా కార్యాలయం పేరు మార్చి సమగ్ర వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది సంబంధిత యుగం విభాగం అధికారులు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్