ప్రజాశక్తి -ఆనందపురం (విశాఖ) : లారీని ఢీకొని కారు దగ్ధమవ్వడంతో కారు డ్రైవర్ సజీవదహనమైన ఘటన సోమవారం తెల్లవారుజామున విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. ఆనందపురం–పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తార్వు జంక్షన్ వద్ద ఒడిశా నుంచి వస్తున్న కారు ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ సజీవదహనమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
లారీని ఢీకొని కారు దగ్ధం - డ్రైవర్ సజీవదహనం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)