సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్నారుల దగ్గు మందుపై కేంద్రం కీలక నిర్ణయం

1 గంట క్రితం

syrup.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 09:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు వాడకాన్ని తగ్గించేలా ఔషధ నియంత్రణ సంస్థ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. దగ్గు మందు సీసాలపై ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎరుపు రంగులో హెచ్చరిక ముద్రించాలని ప్రతిపాదించింది. ప్యాకేజింగ్‌పై పాఠశాల వయస్సు పిల్లల చిత్రాన్ని కూడా ఉంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ పరిశీలనకు పంపారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో కేంద్రం దగ్గు మందులు, సిరప్‌లను ఓటీసీ విభాగం నుంచి తొలగించి.. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్