ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
అయితే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులను దృష్టిలో ఉంచుకుని దసరా సెలవుల్లో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు సెలవుల అనంతరం నిర్ణీత తేదీల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి.







కామెంట్‌లు (0)