సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ వైపు అల్పపీడనం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు

49 నిమిషాల క్రితం

rain.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : బంగాళాఖాతం ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం అల్లూరి సీతారామరాజు, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్