ప్రజాశక్తి–పల్నాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా కె. జగదీష్ ఆడహళ్లిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సీఎంఎస్‌జీ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా కె. జగదీష్ ఆడహళ్లికి పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది.
కాగా, 2014 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి బి. కృష్ణారావు గత ఏడాది సెప్టెంబర్ 14న పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 10 నెలలపాటు జిల్లాలో విధులు నిర్వహించిన ఆయన ఈ ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వ సర్వీసైన సీబీఐకి బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో కె. జగదీష్ ఆడహళ్లిని ప్రభుత్వం నియమించింది.







కామెంట్‌లు (0)