న్యూఢిల్లీ : సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే, సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని జంగ్‌పురాలో ఉన్న తన నివాసం బయట తనను అదుపులోకి తీసుకున్నట్లు సిజెపి న్యాయ వ్యవహారాల విభాగం అధిపతి రత్న సింగ్ శనివారం పేర్కొన్నారు. సుమారు 500 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు తన నివాసానికి వచ్చారని, వారు బలవంతంగా లోపలికి రావడానికి ప్రయత్నించారని రత్నసింగ్ అన్నారు. తనతో కలిసి ఉంటున్న మరో న్యాయవాది, వారెంట్ లేకుండా తన ఇంట్లోకి ప్రవేశించడం లేదా సోదా చేయడం కుదరదని చెప్పి వారిని అడ్డుకున్నారని రత్నసింగ్ అన్నారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది చుట్టుముట్టగా, తన నివాసం బయట ఒక స్నేహితుడి కారులో మరో ఇద్దరు న్యాయవాదులతో కలిసి కూర్చుని ఉన్నానని ఆమె చెప్పారు. పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారని, ఢిల్లీ పోలీసు సిబ్బంది తమ కారును అన్ని వైపుల నుండి అడ్డుకున్నారని అన్నారు. తమ చుట్టూ సిఆర్‌పిఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారని అన్నారు.
మరోవైపు అభిజీత్ దీప్కే, సౌరవ్‌దాస్, రాంకా, ధ్రువ్‌రాఠీలను పోలీసులు అరెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ కాగానే వారిని మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.







కామెంట్‌లు (0)