కర్నూలు: కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ (41) అమెరికాలో మృతి చెందారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కిరణ్ అక్టోబర్ 2న గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణవార్తతో కుటుంబంలో విషాదం నెలకొంది. కిరణ్ కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. అక్టోబర్ 2 నుంచి ఆయన విధులకు హాజరుకాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు స్నేహితులకు సమాచారం అందించారు. కిరణ్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురైన స్నేహితులు ఆయన నివాసానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కిరణ్ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. కిరణ్ మరణంతో కర్నూలులోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని అమెరికా నుంచి కర్నూలుకు తీసుకురావడానికి సుమారు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
అమెరికాలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుమారుడు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)