శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తోటపాలెంలో ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టు

1 గంట క్రితం

csps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 11:46 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోలీసులు తీరుపై ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఆగ్రహం

- కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాజీనామా చేసే వరకు పోరాటం

- ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చినబాబు, రాము

ప్రజాశక్తి-విజయనగరం టౌన్: కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ రాజినామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్దులు చేపట్టిన ర్యాలీని పోలీసులు ఎస్ ఎఫ్ ఐ నాయకులపై పోలీసులు అడ్డుకున్నారు. శనివారం స్థానిక తోటపాలెం నుంచి ర్యాలీ చేసేందుకు వెళ్తున్న ఎస్ ఎఫ్ ఐ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ లు చేశారు. శాంతి యుతంగా నిరసన ర్యాలీ చేస్తామని చెప్పినప్పటికీ మార్గమధ్యలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చినబాబు, రాము తో పాటు గుణ, రమేష్, నానిలను బలవంతంగా అరెస్టులు చేసి పోలీస్ వాహనం ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎటువంటి ర్యాలీ చేయకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చినబాబు, రాములు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎస్ ఐ ఆర్ పేరుతో 13 కోట్ల మంది ఓట్లను బీజేపీ సర్కార్ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తొలగించారన్నారు. ఓట్లు తొలగింపు అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. జ్ఞానేష్ కుమార్ తప్పు చేయకపోతే దిల్లీలో విద్యార్దులు ర్యాలీ ను అడ్డుకోవడం కోసం వివిధ రాష్ట్రాల్లో నుంచి పోలీసులను ఎందుకు మోహరించారన్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను, బెంగాల్ లో లక్షలు సంఖ్యలో ఓట్లను కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తొలగించారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా,నియంతృత్వ దేశమా అని ప్రశ్నించారు. తప్పు చేసిన జ్ఞానేశ్వర్ కుమార్ పై చర్యలు తీసుకోకుండా మోదీ ప్రభుత్వం ఆయన ప్రత్యేక భద్రత కల్పించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. ఎన్నికల కమీషనర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ నాయకులు రవికుమార్,సోమేష్ ఎస్ ఎఫ్ ఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్