ప్రజాశక్తి - తెనాలి (గుంటూరు జిల్లా)
స్థానిక హరిహంసికా సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో నిర్వహించిన బెల్ట్ పరీక్షలో 16 మంది అర్హత సాధించారు. అకాడమీ నిర్వాహకులు మాస్టర్ ఎం సత్యనారాయణ (చిన్న మాస్టర్) వెల్లడించిన వివరాల ప్రకారం... ఈనెల 4న నిర్వహించిన బెల్టు పరీక్షకు శిక్షణ పొందుతున్న 20 మంది హాజరయ్యారు. వారిలో 16 మంది ఉత్తీర్ణులై తదుపరి బెల్ట్‌కు అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అకాడమీ మాస్టర్ అందించి, అర్హత సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ శిక్షణలో క్రమశిక్షణ అవసరమన్నారు. ఫలితంగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)