మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Rains - తమిళనాడులో భారీ వర్షాలు - చెన్నైకి రెడ్ అలర్ట్

15 గంటల క్రితం

Rains - Heavy rainfall in Tamil Nadu - Red alert for Chennai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల‌కు రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వాహ‌న‌దారులు తీవ్రంగా ఇబ్బందిప‌డ్డారు. శ‌నివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు చైన్నైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు‍న్నాయి. దీంతో వాతావరణ శాఖ చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు సోమవారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌న్నారు.


వర్షపాతం వివరాలు ....

ప్యారిస్‌ 36 సెం.మీ, కత్తివాక్కం 34, చెన్నై సెంట్రల్‌ 27, సాత్తాంకాడు 26, తిరువొట్రియూర్, ఎన్నూర్‌ 22, ఎంజీఆర్‌ నగర్‌ 19, సీడీ ఆస్పత్రి తండయార్‌పేట, పెరంబూర్‌ 18, తండయార్‌పేట 17, వడపళని, చెన్నై కలెక్టరు కార్యాలయం 16, బేసిన్‌బ్రిడ్జ్, నుంగంబాక్కం, వైఎంసీఏ నందనం, ఆలందూర్‌ 15, ఐస్‌హౌస్, అన్నా వర్సిటీ, సెమ్మేడు (విళుపురం) 14, వాలాజా (రాణిపేట), మీనంబాక్కం, మాధవరం 1 సెం.మీ, మణలి, మడిప్పాక్కం, మణలి న్యూటౌన్, సాలిగ్రామం, వలసరవాక్కం, రెడ్‌హిల్స్, మనంపూండి (విళుపురం), గుమ్మిడిపూండి, మరక్కానం (విళుపురం) 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్