న్యూఢిల్లీ : వందేమాతరం ఆరు చరణాలను పాడాల్సిందేనన్న ఉత్తర్వులను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని 'విభజనవాద మత యుద్ధ గీతం'గా, మతపాలన వైపు ఒక అడుగుగా బి.డి.బోర్కర్, మాజీ ఐఎఎస్ అధికారి బాలకృష్ణన్ సత్యభామ మావోజీ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు నిర్దిష్ట మతానికి చెందిన నిర్దిష్ట దేవతలకు చేసే మతపరమైన ప్రార్థనను జాతీయ గీతంగా విధించాయని, ఇది మత ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి, క్రిమినల్ చట్టాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. జనవరి 28, జూలై 9 తేదీలలో వరుసగా జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యక్తమైన ప్రభుత్వ నిర్బంధం, "మైనారిటీ వర్గాల మత, ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీయడం ద్వారా దేశంలో మత విద్వేషాలను తీవ్రతరం చేసే పరిణా మాలకు దారితీస్తుందని పిటిషన్ల తరపున న్యాయవాది మోహన్ గోపాల్ పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ తన 'ఆనందమఠ్' నవలలో రాసిన ఆరు చరణాల రూపం, ఒక ఆధిపత్య వర్గం ఆధిక్యతను పెంచడం ద్వారా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని, సంఘర్షణను ప్రోత్సహిస్తుందని బోర్కర్ వాదించారు. ఐక్యత, సామరస్యం స్వరూపం శాశ్వతంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఏడాది ఉత్తర్వులు జారీ అయ్యే వరకు సుమారు 79 ఏళ్ల పాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర సమూహాలు ఆనంద్మఠ్లో లేని రెండు చరణాలను మాత్రమే ఆలపించారని పేర్కొన్నారు.
వందేమాతరం పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)