మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మండల వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెర

1 గంట క్రితం

naarpala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నార్పల జడ్పిటిసి వైసిపి అభ్యర్థిగా శివానందరెడ్డి... టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా అరుణమ్మ

ప్రజాశక్తి - నార్పల : నార్పల మండల వైసీపీ టిడిపి అభ్యర్థుల ఖరారు కావడంతో మండలంలో ఉత్కంఠతకు తెరపడింది. మండల జెడ్పీటీసీ వైసిపి అభ్యర్థిగా శివానందరెడ్డి, టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా అరుణమ్మ పేర్లు ఖరారయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి శివానందరెడ్డి మాట్లాడారు. మండల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాసేవకు పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నానని అన్నారు. విద్యావంతుడైన తనను మండల ప్రజలు ప్రోత్సహించి తనకు తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దల సహకారంతో మండలాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన అరుణమ్మ మాట్లాడుతూ.. తాను గతంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేశానని, తన హయాంలో మండల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేశానని అన్నారు. ప్రస్తుతం జడ్పిటిసిగా పోటీ చేస్తున్న తనకు మండల ప్రజలు మరోసారి ఆదరించి జడ్పిటిసిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనకు పార్టీ బీఫామ్ రావడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్