మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

11ఎంపిటిసి స్థానాలకు 26 మంది పోటీ

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పుట్లూరు : మండలంలో నిర్వహిస్తున్న 11 ఎంపీటీసి స్థానాలకు గాను చివరి రోజు 26 మంది బరిలో నిలిచారు. 47 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 21 మంది విత్‌డ్రా చేసుకున్నారు. మండలంలో కూటమి అభ్యర్థులు ఎవరికివారు పోటీలో నిలిచారు. పుట్లూరు, సి. వెంగన్న పల్లి, మడ్డిపల్లి, కుమ్మనమల, దోస లేడు, కడవకల్లు, అరకటి వేముల, కోమటికుంట్ల, ఎంపీటీసీ స్థానాలకు టిడిపి వైఎస్ఆర్ సిపి బరిలో ఉండగా ఎల్లుట్ల ఎంపీటీసీ స్థానా నికి వైఎస్ఆర్సిపి, టిడిపి, బిజెపి పార్టీలు పోటీలో ఉన్నాయి. సూరేపల్లె ఎంపీటీ స్థానానికి వైఎస్ ఆర్ సి పి, టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎస్ గూడూరు ఎంపిటిసి స్థానానికి టిడిపి, జనసేన, వైయస్సార్ సిపి పార్టీలు బరిలో నిలిచినట్లు ఆర్వో నాగరాజు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్