మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నాబ్ తుఫాను ముప్పు: అధికారులకు విస్సన్నపేట తహసిల్దార్‌ ఆదేశాలు

1 గంట క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి ​- విస్సన్నపేట : ముంచుకొస్తున్న 'అర్నాబ్' తుఫాను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మండల పరిధిలోని ప్రభుత్వ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని విస్సన్నపేట తహసిల్దార్ కే. లక్ష్మీ కళ్యాణి ఆదేశించారు. మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రజలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అగ్నిమాపక, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సై అర్జున్ రాజు, అగ్నిమాపక శాఖ అధికారి భరత్ భూషణ్, డిప్యూటీ తహసిల్దార్ విజయభాస్కర్‌లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్