సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండోర్‌‌ గణేశ్‌ ఆలయంలోనూ దొంగలు పడ్డారు !

10 జులై, 2026

indor ganesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పూజారులు, ఆలయ అధికారుల చేతివాటం

ఇండోర్‌ : బిజెపి డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కార్లు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ప్రఖ్యాత ఆలయాల్లో దొంగల చొరబాటు ఘటనలు వెలుగుచూస్తూనేవున్నాయి. అయోధ్య, బద్రీనాథ్‌ ఆలయాల్లో విరాళాలు, కానుకల కుంభకోణాలు మరవకముందే ఇండోర్‌‌లోని ప్రసిద్ధ గణేశ్‌ ఆయలంలో అదే తరహా దోపిడి బహిర్గతమైంది. భక్తులు సమర్పించే విరాళాలను ఆలయ పూజారులు, అధికారులు కమ్ముక్కై దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక జాతీయ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం..ఇండోర్‌లోని ప్రసిద్ధ ఖజ్​రానా గణేశ్​ ఆలయంలో పూజారులు భక్తులు సమర్పించే విరాళాలను తమ సొంత పాత్రల్లో (దక్షిణా పాత్రలు) సేకరించి ఉంచుకునేవారు. ప్రధాన ఆలయంతో పాటు ఆవరణలోని ఇతర ఉప ఆలయాల్లోని పూజారులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజూ వేల రూపాయల విరాళాలను తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిరోజూ వేల రూపాయల ఆదాయం ఆలయ అధికారిక లెక్కల్లోకి రావడం లేదని కథనాలు వచ్చాయి. అంతేకాదు, గత కొంత కాలంగా ఆలయ నిబంధనలు పూర్తిగా అమలుకావడం లేదని ఆరోపణలు రావడంతో, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సంబంధిత అధికారులతో ఆలయాన్ని పరిశీలించింది. ఈ క్రమంలో ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవాలయాల్లో పూజారులు ఎప్పటిలాగే విధులు నిర్వహిస్తున్నప్పటికీ, కానుకలు స్వీకరించడానికి విగ్రహాల ముందు ఉంచిన పాత్రలు కనపడకుండా పోయినట్లు గుర్తించింది. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్ని దక్షిణా పాత్రలను తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లూ ఈ తతంగంపై కనీసం నోరు మెదపని ఖజ్​రానా గణేశ్ ఆలయ కమిటీ మేనేజర్ జీఎస్ మిశ్రా మీడియా కథనాలు రావడంతో స్పందించారు. ఆలయ నిర్వహకుని ఆదేశాల మేరకు అన్ని దక్షిణా పాత్రలను తొలగించామని తెలిపారు. ఇకపై భక్తులు దేవుడికి సమర్పించే నగదు, ఇతర కానుకలన్నీ అధికారిక హుండీల్లోనే వేయాలని పూజారులందరికీ ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు.

ఆలయ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే!

భక్తులు సమర్పించే నగదు, కానుకలను తొలుత జలధారి (కానుకలు వేసే పాత్ర)లో వేసి ఆ తర్వాత వాటిని అధికారిక హుండీలో వేయాలి. బంగారం, వెండి, ఆభరణాలు, రత్నాలు, విలువైన వస్త్రాలు లేదా ఇతర విలువైన కానుకల వివరాలను నమోదు చేయాలి. ఆలయ కార్యాలయంలో వాటిని అప్పగించి రశీదు పొందాలి. ఇందుకు సంబంధించి ఆలయ యంత్రాంగం ఒక అధికారిక రిజిస్టర్ పుస్తకాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆచరణలో ఈ నిబంధనలు తుంగలో తొక్కి వాటిని ఆలయ అధికారులు, పూజారులు కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్