అగర్తల:
త్రిపురలోని అగర్తల మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా 16 పట్టణ స్థానిక సంస్థలకు శుక్రవారం ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
ఈ 16 పురపాలక సంస్థల పరిధిలోని 268 స్థానాలకు గానూ మొత్తం 733 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 5.56 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) పరిధిలో 51 వార్డులు ఉన్నాయి.
"రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది" అని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యదర్శి అనురాగ్ సేన్ వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం సుమారు 4,600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించేందుకు 39 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) సహా 10,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.







కామెంట్‌లు (0)