మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ద్రవ్యోల్భణంతో పల్లె బతుకు విలవిల

2 గంటల క్రితం

hike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కష్టంగా చదువు

- ఆహారానికీ కష్టాలు

మారుతున్న ఆర్ధిక పరిస్థితుల్లో పల్లెల్లో జనం పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. దైనందిక జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ద్రవ్యోల్భణంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్వే చేసింది. 12 అంశాలకు సంబంధించి ఈ సర్వే చేయగా, వాటిలో పది అంశాల్లో పల్లెల్లో కష్టాలున్నట్లు తేలడం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఆహారం, పానీయాలు,, దుస్తులు, పాదరక్షలు, గృహవసతి, నీరు, విద్యుత్, గ్యాస్ గృహోపకరణాలు, ఆరోగ్యం, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ వినోదం, క్రీడలు, సంస్కృతి, విద్యా రెస్టారెంట్లు, వసతులతో పాటు, పాన్, పొగాకు, మత్తు పదార్థాల వంటివి కూడా సరే్వ చేసిన జాబితాలో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా ఈ సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఆహార రంగంలో ఎక్కువ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ రంగంలో పట్టణ ప్రాంతంలో ఒక శాతానికన్నా అధికంగా ద్రవ్యోల్బణం ఉన్నట్టు పేర్కొన్నారు. విద్యా రంగంలో ఏకంగా 2.80శాతం ఎక్కువగా ద్రవ్యోల్బణం కనిపిస్తోంది. సరైన విద్య సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. వసతి, ఆరోగ్య రంగాల్లో కొంతవరకు పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆరోగ్య విభాగంలో కేవలం 1.14శాతమే ద్రవ్యోల్బణం నమోదైంది.

​

​

12 రంగాల్లో గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణ పరిస్థితి (శాతంలో)

విభాగం గ్రామీణం పట్టణం మొత్తం

ఆహారం, పానీయాలు 9.93 8.78 9.54

దుస్తులు, పాదరక్షలు 2.76 2.18 2.54

వసతి, నీరు, విద్యుత్, గ్యాస్ 3.07 2.11 2.58

గృహోపకరణాలు 2.45 1.83 2.22

ఆరోగ్యం 1.24 1.97 1.48

రవాణా 4.58 3.97 4.35

సమాచార, కమ్యూనికేషన్ 2.03 1.62 1.87

వినోదం, క్రీడలు, సంస్కృతి 3.60 1.37 2.50

విద్య 8.85 6.05 7.27

రెస్టారెంట్లు, వసతి సేవలు 4.21 8.68 6.31

వ్యక్తిగత సంరక్షణ 16.76 18.01 17.30

పొగాకు, మత్తు పదార్థాలు 5.36 4.78 5.20

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్