మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌లో భారీ భూకంపం: భారత్ సహా ఐదు దేశాల్లో ప్రకంపనలు

15 నిమిషాల క్రితం

నేపాల్‌లో భారీ భూకంపం: భారత్ సహా ఐదు దేశాల్లో ప్రకంపనలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 08:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు: నేపాల్‌లో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ భూకంప ప్రకంపనలు నేపాల్‌తో పాటు భారత్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా సహా మొత్తం ఐదు దేశాల్లో కనిపించాయి.


నేపాల్‌లోని కోశి ప్రావిన్స్ పరిధిలోని లెలెప్ (Lelep) ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలానికి సుమారు పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.


భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో కూడా భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్